Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahaveer Karna: వెండితెరపై మైథలాజికల్ కథలకు, చారిత్రక వీరుల గాథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే మహాభారతంలోని సంక్లిష్టమైన పాత్రలను తెరకెక్కించేటప్పుడు చిన్న తేడా వచ్చినా తీవ్ర చర్చలకు దారితీస్తుంది. ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ సరిగ్గా ఇలాంటి చర్చకే తెరలేపింది. దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్లో ఆయన కర్ణుడిగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘మహావీర్ కర్ణ’. తాజాగా వివిధ భాషల్లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు క్షణాల్లో వైరల్ అవ్వగా, అదే సమయంలో నెట్టింట ఒక పెద్ద వివాదానికి ఆజ్యం పోశాయి. సాధారణంగా భారతీయ ఇతిహాసాల్లో కర్ణుడంటే త్యాగానికి, ఎదురులేని దానగుణానికి ప్రతీకగా కనిపిస్తాడు. విధి వంచించినా ఇచ్చిన మాట కోసం నిలబడ్డ ‘దానవీర కర్ణుడు’గానే తెలుగు, తమిళ ప్రజల మనసుల్లో ఆయనకు బలమైన ముద్ర ఉంది. అయితే ఈ సినిమాలో ఆయన్ను రౌద్ర రూపంలో, ‘మహావీరుడు’గా హైలైట్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణుడి నిజమైన వ్యక్తిత్వాన్ని పక్కనపెట్టి, కేవలం కమర్షియల్ హంగుల కోసం ఒక యుద్ధోన్మాదిలా లేదా అతిశయోక్తులతో కూడిన వీరుడిగా చూపిస్తున్నారా అనే ప్రశ్నలను మేకర్స్‌కు నెటిజన్లు సంధిస్తున్నారు. మహాభారత మూలాలను మార్చే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం పక్కన పెడితే, లారెన్స్ లుక్ మాత్రం అభిమానులకు విపరీతమైన కిక్ ఇస్తోంది. తన సినీ ప్రస్థానంలో ఫస్ట్ టైం ఒక పౌరాణిక యోధుడి పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేసినట్లు తాజాగా రిలీజ్ చేసిన లుక్‌ను బట్టి అర్థం అవుతుంది. పెన్ మూవీస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తుండటం విశేషం. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లతో హై-స్టాండర్డ్స్‌లో తెరకెక్కబోతన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 2027 నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి పోస్టర్ స్థాయిలోనే ఇంతటి వేడి రాజేసిన ఈ ‘మహావీర్ కర్ణ’, తెరపైకి వచ్చేసరికి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో, విమర్శకుల ప్రశ్నలకు డైరెక్టర్ రమేష్ వర్మ తన కథాకథనాలతో ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
I’m truly happy and blessed to portray one of the most legendary characters from our mythology, #Karna 🏹⚔️
I never expected this script to come to me, and my thanks to director @DirRameshVarma for bringing this script to me and making this happen.
I take on this journey with… pic.twitter.com/hdGmzxAE6G
— Raghava Lawrence (@offl_Lawrence) September 22, 2026
తాజావార్తలు
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!