రాధే : ‘సీటిమార్’ సాంగ్ మేకింగ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మే 13న థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ బేసిస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని జీ ప్లెక్స్ సంస్థ మూవీని చూడాలంటే రూ. 249 పే చేయాలని ప్రకటించింది. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఓ బాలీవుడ్ సినిమా ఒకే రోజున ఇలా థియేటర్లలోనూ, ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. ఇక ఈ చిత్రం నుంచి సోమవారం విడుదలైన ‘సీటిమార్’ సాంగ్ యూట్యూబ్‌లో 24 గంటల్లో 30 మిలియన్ల వ్యూస్ దాటేసి రికార్డులను బద్దలుకొట్టింది. ఏప్రిల్ 26న విడుదలైన ఈ సాంగ్ లో దిశా పటాని, సల్మాన్ సిజ్లింగ్ కెమిస్ట్రీతో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ‘సీటిమార్’ సాంగ్ మేకింగ్ వీడియోను పంచుకున్నారు చిత్రబృందం. ‘సీటిమార్’ సాంగ్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా… షబ్బీర్ అహ్మద్ ఆలపించారు.
Also Read
తాజావార్తలు
-
China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!
-
West Bengal: పశ్చిమ బెంగాల్ పేరు మార్పు.. ఇకపై ‘‘పశ్చిమ బంగా’’
-
Devara: ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సస్పెన్స్‌కు తెర.. బడా ఛానెల్స్‌కు షాక్
-
Krishna Water Dispute: కృష్ణా జలాలపై మళ్లీ రగడ.. ఏపీకి తెలంగాణ స్ట్రాంగ్ కౌంటర్
-
Telangana Global Summit: గ్లోబల్ సమ్మిట్‌పై రేవంత్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!