టాలీవుడ్‌లో ఇప్పటికే సరికొత్త యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రాజా ది రాజా’. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ ఫ్రెష్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీకి అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. కాగా, తాజాగా ఈ చిత్ర బృందం అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది
ఈ సినిమాను జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
అయితే ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల్లో మైలేజ్ పెంచేలా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అండ లభించడంతో.. ఈ చిన్న చిత్రం ఇప్పుడు భారీ స్థాయిలో, గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను చేరుకునే అవకాశం దక్కించుకుంది. విడుదల తేదీని ఖరారు చేస్తూ వదిలిన లేటెస్ట్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హీరో రుత్విక్, హీరోయిన్ విశాఖ ధీమన్ మధ్య ఉన్న లవ్లీ కెమిస్ట్రీతో పాటు వారి సరదా ప్రయాణాన్ని ఈ పోస్టర్‌లో హైలైట్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, ఆకట్టుకునే డిజైన్ చిత్రంలోని రొమాంటిక్ మూడ్‌ను ప్రెజెంట్ చేస్తోంది. పోస్టర్‌లో వీరిద్దరి ఉత్సాహం, ఎనర్జీ చూస్తుంటే యువతను ఆకట్టుకునే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

