ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక షోస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో వేయనున్నారు. అందుకు అనుగుణంగా నైజాం లో అధిక ధరలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేలా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. ఇక ఏపీ లోను టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఈ ధరలు కాస్త తక్కువ అనే చెప్పాలి
also read : Sukumar : కన్ఫామ్.. పుష్ప 2 కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చింది దేవిశ్రీనే.!
డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలతో పాటు డిసెంబరు 5న తెల్లవారుజామున 1 గంట షోకు పర్మిషన్ ఇచ్చారు,బెన్ఫిట్ షోస్ కు రూ.944 టికెట్ ధరను నిర్ణయించారు. ఇక రిలీజ్ డే నాడు టికెట్డ్ ధరను సింగిల్ స్క్రీన్ కు రూ. 297.50 అలాగే ముల్టీప్లెక్స్ లో రూ. 377 గాఫిక్స్ చేసార. మొదటి రోజు ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. ఇక రిలీజ్ రెండవ రోజు అనగా డిసెంబర్ 6వ తేదీ నుంచి 17 వరకు ఐదు షోస్ వేసుకునేలా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల డిసెంబరు 17 వరకూ పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. కాగా ప్రీమియర్స్ కు సంబందించిన బుకింగ్స్ ను నేడుఓపెన్ చేయనున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ లోను పుష్ప 2వేసేలా ఏర్పాట్లు చేసున్నారు. కాకుంటే వీలైనన్ని ప్రీమియర్స్ సింగిల స్క్రీన్స్ లో ప్రదర్శించేందుకు మొగ్గు చుపుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ముల్టీప్లెక్స్ లో లిమిటెడ్ షోస్ వేయాలని ఆలోచనలలో ఉన్నారని తెలుస్తోంది.