Site icon NTV Telugu

Allu Arjun: షాకింగ్.. రీ రిలీజ్ వద్దన్న బన్నీ?

Allu Arjun

Allu Arjun

ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలనే కాదు, ఇటీవలే రిలీజ్ అయి మంచి కరేజ్ అందుకున్న సినిమాలను సైతం రీ-రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య బాహుబలి ఫ్యాన్స్ సినిమాను ఒక భాగంగా కట్ చేసి రిలీజ్ చేసి, సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు. వీరి ప్రణాళిక ప్రకారం పుష్ప మొదటి రెండు భాగాలను కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని భావించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్, సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఇద్దరూ ఆ ప్రపోజల్‌ను తిరస్కరించినట్లు సమాచారం. కారణం, పుష్ప సెకండ్ పార్ట్ గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదలైంది.

Also Read :MLA MS Raju: బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా..! ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్..

కానీ బాహుబలి సుమారు 10 ఏళ్ల క్రితం వచ్చింది కాబట్టి ఆ సినిమా మీద ఇప్పటికీ క్రేజ్ కొనసాగుతోంది. కాబట్టి గత ఏడాది విడుదలైన సినిమాను ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేయడం సరైందేమీ కాదని వారు భావించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు సుకుమార్ కూడా ఈ కటింగ్ చూసుకునేంత ఖాళీగా లేరని, ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో ఇప్పట్లో ఈ సినిమాను రీ-రిలీజ్ చేసే ఆలోచన లేదని చెబుతున్నారు. రామ్ చరణ్‌తో సినిమా పూర్తి చేసిన తర్వాత సుకుమార్ పుష్ప మూడవ భాగంపై దృష్టి కేంద్రీకరించనున్నారని, అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమా పూర్తవగానే సుకుమార్ ప్రాజెక్టుపై ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Exit mobile version