ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు స్టేట్స్ లో ఎంతటి భారీ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఫ్యాన్స్ ను ఆర్మీ అని పిలుచుకుంటారు బన్నీ. అయితే తెలుగు స్టేట్స్ తో పాటు కేరళలో కూడా అంతే స్థాయిలో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు అల్లు అర్జున్. అక్కడ బన్నీ సినిమాలకు వీరపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప ఆ విషయాన్నీ మరోసారి ప్రూఫ్ చేసింది.
Also Read : Zebra contest : ఆహా OTT జీబ్రా కాంటెస్ట్ లో గిఫ్ట్ లు గెలుచుకునే అవకాశం
పుష్ప -2 ప్రమోషన్స్ లో భాగంగా కొచ్చి వెళ్లిన అల్లు అర్జున్ కు ఘన స్వాగతం పలికారు మల్లు ఫ్యాన్స్. ఇక రిలీజ్ రోజు ఏకంగా రూ. 6.35 కోట్ల గ్రాస్ అందుకుని మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్, ముమ్మాట్టి వంటి హీరోల సినిమాలను కూడా వెనక్కు నెట్టింది. ఇప్పటికి అక్కడ రూ. 17.03 కోట్ల గ్రాస్ రాబట్టింది. కానీ ఇక్కడ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటి లాభాల బాటలో పయనిస్తోంది. అయితే కేరళ లో పుష్ప ఇప్పుడు కాస్త నెమ్మదించింది. మరి డౌన్ ఫాల్ కాకుండా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. కానీ కేరళలో క్రిస్మస్ నాటికి పుష్ప రన్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. క్రిస్మస్ కు మోహన్ లాల్ బారోజ్, ఉన్నిముకుందన్ మార్కో తో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో ఆ సినిమాల నేపథ్యంలో పుష్ప -2 కు స్క్రీన్స్ తగ్గే ఛాన్స్ ఉంది, ఈ లెక్కన కేరళలో పుష్ప లాంగ్ రన్ ముగిసినట్టే అని ట్రేడ్ అంచనాలు వేస్తున్నాయి.