Site icon NTV Telugu

Purusha: హీరోయిన్ వైష్ణవి ఫస్ట్ లుక్ రిలీజ్: ‘కన్నీళ్లతో చంపేస్తా’ అంటూ భార్యాభర్తల పోరు!

Purusha

Purusha

సినిమా ప్రమోషన్లలో వైవిధ్యం చూపిస్తూ, విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది ‘పురుష:’ చిత్ర యూనిట్. కేవలం పోస్టర్లు, ఆసక్తికరమైన ట్యాగ్ లైన్లతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. వీరు వులవల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read :CM Chandrababu: ముందు సస్పెండ్, ఆ తర్వాతే మీటింగ్.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్!

తాజాగా విడుదలైన వైష్ణవి కొక్కుర పోస్టర్ సినిమాలోని ప్రధాన సంఘర్షణను ప్రతిబింబిస్తోంది. పోస్టర్ గమనిస్తే, భార్యాభర్తల మధ్య సాగే ఆధిపత్య పోరును సింబాలిక్‌గా చూపించినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా పోస్టర్‌పై ఉన్న “కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా” అనే డైలాగ్ ఈ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో హింట్ ఇస్తోంది. ఒకరినొకరు సీరియస్‌గా చూసుకుంటున్న హీరో హీరోయిన్లను చూస్తుంటే, వెండితెరపై భార్యాభర్తల మధ్య జరిగే యుద్ధం ఓ రేంజ్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది.

Also Read :SHANTI Bill: ఇక అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. “శాంతి బిల్లు”కు లోక్‌సభ ఆమోదం..

ఈ చిత్రంలో కేవలం సీరియస్ డ్రామా మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు భారీ కామెడీ టీమ్ సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్‌తో పాటు కసిరెడ్డి, సప్తగిరిల పాత్రలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వెన్నెల కిషోర్, వి.టి.వి. గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి ప్రముఖ కమెడియన్లు తమ కామెడీతో సందడి చేయనున్నారు. వైష్ణవితో పాటు విషిక, హాసిని సుధీర్‌లు ఈ చిత్రంలో ఇతర కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనుంది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ‘పురుష:’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!

Exit mobile version