Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ప్రస్తుతం తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సమాజంలో మారాల్సిన పద్ధతులపై ‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musings) ద్వారా నిరంతరం గొంతు విప్పుతూనే ఉన్నారు. ఇటీవల పెళ్లి, దేవుళ్లపై ఆయన చేసిన పాత కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే, వాటన్నింటినీ పక్కన పెట్టి.. ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్’ (Future Education) అనే సరికొత్త ప్రాక్టికల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో పూరి ముందుకు వచ్చారు.
నేటి కార్పొరేట్ స్కూళ్లన్నీ కేవలం ర్యాంకులు, మార్కులు, పిల్లలతో పుస్తకాలు బట్టీ పట్టించడం (కంఠస్థం) పైనే శ్రద్ధ పెడుతున్నాయని పూరి జగన్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఏసీ రూముల్లో కూర్చోబెట్టి అపారమైన పుస్తక జ్ఞానాన్ని అందిస్తే సరిపోదని, అది వారిని మానసికంగా బలమైన వ్యక్తులుగా మార్చలేదని పూరి స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఎల్కేజీ (LKG) నుంచే పాఠ్యాంశాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని ఆయన డిమాండ్ చేశారు.. ‘పిల్లలకు సొంతంగా ఇంటి పనులు ఎలా చేసుకోవాలన్నది ఎల్కేజీ నుంచే నేర్పాలి. వ్యక్తిగత శుభ్రత గురించి చెప్పాలి. స్కూళ్లలోనే ప్రతి విద్యార్థికి ‘కుకింగ్ క్లాసెస్’ (వంట నేర్పడం) తప్పనిసరి చేయాలి. అప్పుడే వారు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా ఒంటరిగా బతకగలరు’ అని తెలిపాడు. అంతే కాదు..
Also Read
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
‘స్కూళ్లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠాల కంటే ముందు.. సెల్ఫ్ కంట్రోల్ (స్వయం నియంత్రణ), టైమ్ మేనేజ్మెంట్ (సమయపాలన), ఎమోషనల్ బ్యాలెన్స్ (భావోద్వేగ సమతుల్యత) లాంటి వాటిపై ప్రత్యేక పాఠాలుండాలి. ఎందుకంటే జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోవడానికి ఇవే ఉపయోగపడతాయి. ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లలకు ‘డిజిటల్ డిసిప్లిన్’ (గ్యాడ్జెట్స్‌ను ఎలా వాడాలి) అనేది ఖచ్చితంగా నేర్పాలి. అలాగే వారి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ‘మెంటల్ హెల్త్’ పై అవగాహన కలిగించే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్కూళ్లలోనే నిర్వహించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం కోసం ప్రతి విద్యార్థి కనీసం మూడు భాషలు అనర్గళంగా మాట్లాడేలా తయారు చేయాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా ప్రకృతిని, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలనేది చిన్నతనం నుంచే నూరిపోయాలి’ అని కుండ బద్దలు కొట్టినట్లుగా తెలిపాడు. ఈ టాపిక్‌తో పూరి నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు ర్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో.. పూరి చెప్పినట్లు ‘ఎమోషనల్ బ్యాలెన్స్’, ‘లైఫ్ స్కిల్స్’ నేర్పడం చాలా అవసరమని విద్యావేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?