Site icon NTV Telugu

Puri Jagannad : పవర్‌ఫుల్ విలన్‌ని సెట్ చేసిన పూరి జగన్నాధ్..?

Puri Jaganadha Fahad Fazil

Puri Jaganadha Fahad Fazil

టాలీవుడ్ ఇండస్ట్రీలో పడిలేచిన కెరటం అంటే దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆయన డైరెక్షన్ తో దాదాపు అందరు స్టార్ హీరోలకు మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు పూరి. కానీ ప్రస్తుతం పూరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టేస్తుంటాడు పూరి. కానీ ఈసారి మాత్రం ఇబ్బంది తప్పలేదు. ఇటు టాలీవుడ్ హీరోలు కూడా ఎవ్వరూ ఆయనతో సినిమా చేయడానికి రెడీగా లేని పరిస్థితి. ఎలాగో అలా కష్టపడి మొత్తానికైతే.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడికి కథ చెప్పి.. మెప్పించడం తో పూరి మళ్లీ ప్రేక్షకులతో పాటు నిర్మాతల దృష్టిలో పడ్డాడు. ఈ కలయికలో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

Also Read: Janhvi Kapoor : కోలీవుడ్ ఎంట్రీ కి సిద్ధం అయిన జాన్వీ కపూర్ ..?

ఇక ఈ మూవీలో నటీనటుల గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్నప్పటికి. ఇప్పటికే సీనియర్ నటి టబు ఓ పవర్ ఫుల్ పాత్రలో ఓకే కాగా. హీరోయిన్ రాధిక అప్టే కూడా కన్‌ఫామ్ అయింది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో విలన్ పాత్ర గురించి ఓ అప్‌డేట్ వైరల్ అవుతుంది. అయితే, ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. దీంతో ఈ పాత్రలో సాలిడ్ యాక్టర్‌ ఫహాద్ ఫాజిల్ అయితే బాగుంటుందని భావించి. ఇప్పటికే పూరి ఆయనకు కథను కూడా వినిపించాడని తెలుస్తోంది. కానీ ‘పుష్ప’ మూవీ ఫేమ్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఫహాద్. ఇక పూరి కథ నచ్చినప్పటకి ఆయన బిజీ షెడ్యూల్ వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోతున్నారట. దీంతో పూరి వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా, ఫహాద్ కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తోంది.

Exit mobile version