విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఈవెంట్లో 30 ఇయర్స్ కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైసిపి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉన్న ఆ కామెంట్స్ వైసీపీ అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో సినిమాని బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ సృష్టించారు. తాజాగా ఈ విషయం మీద మీడియా ముందుకు వచ్చింది సినిమా టీం. నిర్మాత సాహు గారపాటితో పాటు హీరో విశ్వక్సేన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాహు గారపాటి మాట్లాడుతూ పృథ్వి ఆ కామెంట్స్ చేస్తున్నప్పుడు మేము వేదిక వద్ద లేమని ఆయన చెప్పుకొచ్చారు.
Vijay: విజయ్ కీలక నిర్ణయం.. కాసేపట్లో ప్రశాంత్ కిషోర్‌తో భేటీ
సరిగ్గా అదే సమయానికి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారనే విషయం తెలియడంతో ఆయనని రిసీవ్ చేసుకునేందుకు తనతో పాటు విశ్వక్సేన్ కూడా బయటకు వచ్చారని, తాము వచ్చేలోపు ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. సరిగ్గా సినిమా రిలీజ్ కి ముందు ఇలా బాయ్కాట్ అనే ట్రెండ్ చూసి షాక్ కి గురయ్యామని ఆయన అన్నారు. ఇది మా నోటీసులో లేకుండా జరిగింది, అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే ఇది సినిమా. కేవలం ఒకరిద్దరి కష్టం వల్ల సినిమా రూపుదిద్దుకోదు, ఎంతోమంది కష్టపడితేనే ఈ సినిమా బయటకు వస్తుంది. ఒక్కరు చేసిన పొరపాటు వల్ల మిగతా అందరి మీద ఆ ఎఫెక్ట్ పడడం కరెక్ట్ కాదు. సినిమాని సినిమాగా చూడాలంటూ సాహూ గారపాటి చెప్పుకొచ్చారు.