NV Prasad: ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే.. ఈరోజు జనసేన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NV Prasad Sensational Comments: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్రబృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తిరుపతిలో నిర్వహించిన ప్రజారాజ్యం పార్టీ సభ నిర్వహించాం. కానీ చిరంజీవికి నేను చెప్పింది కాకుండా తాను అనుకున్నది అక్కడున్న 30 మందికి చెప్పి పంపేశాడు. అదిచూసి నేను ఆశ్చర్య పోయాను. నేను చెప్పింది కాకుండా చిరంజీవి అనుకున్నది చెప్పడమేంటని ప్రశ్నలు మొదలయ్యాయి అంటూ ఎన్.వి. ప్రసాద్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత చిరంజీవి చాలా సఫర్ అయ్యారు. అందులో మేము భాగమే.. తిరుపతి ఎలక్షన్స్ ఎలా చేశామన్నది చిరంజీవి ఫ్యాన్స్‌కి అందరికి తెలుసు. కానీ ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి అమ్ముడు పోయాడు అంటున్నారు కదా? అది ఏంటో నాకు మాత్రమే తెలుసు. అందరిముందు ఆయనకు కూడా తెలియని నిజమిది ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. అయితే మద్రాసులో ప్రసాద్ ల్యాబ్ పక్కనుండే కృష్ణా గార్డన్ అనే ప్రాపర్టీ అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేసేముందు చిరంజీవి అప్పులన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి చిరంజీవి. అలాంటి వ్యక్తిని అమ్మడు పోయారు అంటూ చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన కష్టంతో ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండ్రస్ట్రీ వుంది. ఈరోజుకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పని చేసే వ్యక్తి గురించి ఎవరుపడితే వారు మాట్లాడటం, ఏదంటే అది రాస్తారు. మరి నాగురించి రాయండి ధైర్యముంటే? నేను రేడీ దేనికైనా!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి చెబుతున్నా ఆయన్ను కూడా మీరు ఏమన్నా అనండి భరిస్తాడు. కానీ చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం పవన్ కళ్యాణ్ రోడ్డులోకి వెళ్లి పోతారు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే ఈరోజు ఈజనసేన అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందుగానీ.. రాసే ముందుగానీ ఒక సెకెండ్ ఆలోచించండి అంటూ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?