M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లెజెండరీ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు (M.S. Raju) ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త టాలెంటెడ్ పర్సన్స్‌ను పరిచయం చేసిన ఆయన, ఒకానొక సమయంలో ఎదురైన ఫ్లాప్‌లు, విమర్శలకు ఎలా బదులిచ్చారో గుర్తుచేసుకున్నారు. అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శత్రువు’, ‘దేవి’, ‘దేవి పుత్రుడు’ వంటి వరుస చిత్రాల తర్వాత తాను మరో సినిమా చేయాల్సి వచ్చిందని ఎం.ఎస్. రాజు తెలిపారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ‘దేవి పుత్రుడు’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. సినిమాకు తాను ఎంత కష్టపడినప్పటికీ, కొందరు “ఇలాంటి సినిమా ఎందుకు చేశావు?” అంటూ తీవ్రంగా విమర్శించారని, ఆ కోపంతోనే అదే సంవత్సరంలో వెంటనే మరో సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
కోడి రామకృష్ణ వద్ద ఆ సమయంలో డేట్స్ అందుబాటులో లేకపోవడంతో, తానే సొంతంగా ఒక కథ రాసుకుని కేవలం రెండు మూడు నెలల్లోనే మే నెలలో సినిమాను ప్రారంభించి అక్టోబర్ నాటికి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. తనపై నెగెటివ్‌గా మాట్లాడిన వారికి అదే ఏడాది ‘మనసంతా నువ్వే’ సినిమాతో సబ్జెక్ట్‌పరంగా సమాధానం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సినిమా ఆడుతున్నప్పుడు ఎంతగానో పొగిడిన మనుషులే, ఒక ఫ్లాప్ రాగానే వేలెత్తి చూపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా పరాజయం పాలైతే దాన్ని కొలమానంగా తీసుకుని “నువ్వు ఇంతే” అని డిసైడ్ చేయడం రాంగ్ అని ఎం.ఎస్. రాజు పేర్కొన్నారు. ఆ విమర్శల నుంచే కసిగా బయటకు వచ్చి, “నువ్వు లేవు, నువ్వు లేకుండా నేను సినిమా తీసి చూపిస్తా” అనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్లినట్లు ఆయన ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు