NTV Telugu Site icon

Kedar Selagamsetty : దుబాయిలో నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి

Producer Kedar

Producer Kedar

ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గణేశా సినిమా నిర్మాత కేదార్‌ కొద్దిరోజుల క్రితం దుబాయ్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే.  అయితే  కేదార్ మృతిపై మిస్టరీ కొనసాగింది .కేదార్ ఎలా చనిపోయాడు అనే దాని పై దుబాయ్ పోలీసులు ఎటు తేల్చలేదు. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ  పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు గతంలో తెలిపారు. తాజాగా ఈ కేసులోని పూర్వాపరాలు వెల్లడించారు పోలీసులు.

Also Read : Ram Charan : ఢిల్లీకి రామ్ చరణ్.. ఎందుకంటే..?

పది రోజుల క్రితం దుబాయ్ లో అనుమానాస్పత్తిలో మరణించిన నిర్మాత కేదార్ మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చారు దుబాయ్ పోలీసులు. కేదార్ ది సహజ మరణమే అని, ఎటువంటి అనుమానాస్పద కారణాలు లేవని రిపోర్ట్ లో పేర్కొన్నారు దుబాయ్ పోలీసులు.  కేదార్ భార్య రేఖా వీణకు కేదార్ మృతదేహాన్ని అప్పగించారు దుబాయ్ పోలీసులు. భారత ప్రభుత్వ అనుమతితో కేదార్ భార్యకు మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు. దుబాయ్ లోనే కేదార్ మృతదేహానికి ఆయన భార్య, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇండియాకి మృతదేహాన్ని తీసుకువస్తే ఇబ్బందులకు గురవుతామని, అందుకే దుబాయ్ లోనే అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కేదార్ కు కొందరు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. కానీ కేదార్ అంత్యక్రియలకు సినీ రాజకీయ ప్రముఖులు ఎవరు హాజరుకాలేదు. సినీ రాజకీయ ప్రముఖులకు మీడియేటర్ గా ఉన్న కేదార్, కొందరు సినీ రాజకీయ నాయకుల సంబంధించి బినామీగా ఉండి వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. సినీ రాజకీయ నేతల డబ్బులతో కేదార్ దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని సినీ, రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు.