Site icon NTV Telugu

Spirit : స్పిరిట్ షూటింగ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన నిర్మాత భూషణ్ కుమార్

Spirit

Spirit

బాహుబలి సిరీస్ చిత్రాల కోసం ఫైవ్ ఇయర్స్ కేటాయించిన డార్లింగ్ ప్రభాస్. ఆదిపురుష్ టైంలో ఏడాదికి వన్ ఆర్ టూ మూవీస్‌తో ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఫుల్ ఫిల్ చేసేందుకు వరుస ప్రాజెక్టులకు కమిటై పట్టాలెక్కించాడు. కానీ సినిమాలను అనుకున్న టైంలో కంప్లీట్ చేయడంలో తడబడుతున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కి 2898ఏడీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ గ్లోబల్ స్టార్ రాజాసాబ్, ఫౌజీ చిత్రాలను ఎనౌన్స్ మెంట్ చేసినంత ఫాస్టుగా ఫినీష్ చేయలేకపోతున్నాడు. అన్నీ అనుకున్నట్లే జరిగి ఉంటే ఈ పాటికే రాజా సాబ్ థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది.

Also Read : Benz : లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మలయాళ హీరో

కల్కి వచ్చి ఈ జూన్ 27కు ఏడాది దాటిపోతుంది. అంటే ఫ్యాన్స్ డార్లింగ్‌ను పలకరించి ఇయర్ కాబోతుంది. అదే డేట్‌న వస్తోన్న కన్నప్పతో కాస్త కవర్ చేసినప్పటికీ డై హార్ట్ ఫ్యాన్స్‌కు అది సరిపోదు. రాజా సాబ్, ఫౌజీ ఎప్పుడు వస్తాయో క్లారిటీ లేదు. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదని టాక్. కల్కి టైంలో కాలి నరాలు దెబ్బ తినడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్న ప్రభాస్ రెస్ట్ కావాల్సినప్పుడల్లా ఫ్లైట్ ఎక్కేస్తుంటాడు. రీసెంట్లీ కూడా ఫారిన్ వెళ్లిన డార్లింగ్ తిరిగి వచ్చాక రాజాసాబ్, ఫౌజీ షూటింగ్‌లో పాలగొంటాడట. ఈ కారణాలతోనే మోస్ట్ యాంటిసిపెటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా ఆలస్యం  అవుతుందని టాక్. ఈ నేపథ్యంలో రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. మరో టూ, త్రీమంత్స్‌లో స్పిరిట్ పట్టాలెక్కుతుంది, దీని తర్వాతే సందీప్ రెడ్డి వంగాతో యానిమల్ పార్క్ నిర్మిస్తాము’ అని వెల్లడించాడు. ఇందులో దీపికా నటించబోతుందని టాక్.

Exit mobile version