Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్

Idupu Kayitham

Idupu Kayitham

టాలీవుడ్‌లో విభిన్నమైన కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్), యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (బన్నీ వాస్ వర్క్స్) సంయుక్తంగా సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా, యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “ఇడుపు కాయితం” అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం, ఇటీవలే వైభవంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా అనౌన్స్ అయిన అతి తక్కువ సమయంలోనే “ఇడుపు కాయితం” అనే విలక్షణమైన టైటిల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అసలు ఈ టైటిల్ వెనుక ఉన్న నేపథ్యం ఏంటా అనే ఆసక్తి సినీ లవర్స్‌లో పెరిగిపోయింది. టైటిల్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా విపరీతమైన రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమాలో తెలంగాణ ప్రసిద్ధ ఫోక్ సాంగ్స్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ప్రియదర్శి, నాగదుర్గల కాంబినేషన్‌తో పాటు ఈ చిత్రంలో ఒక హోమ్లీ స్టార్ కాస్టింగ్ ఉంది. శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఎలాంటి బ్రేకులు లేకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సినిమాను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.