తేజ సజ్జా హీరోగా క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ ఎంతటి సంచలనం సృస్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని కూడా ప్రకటించారు. సీక్వెల్ లో హనుమాన్ పాత్ర సినిమాలో కీ రోల్ పోషిస్తుందని కూడా సినిమా చూసినపుడు అర్ధం అవుతుంది. అయితే ఆ రోల్ లో నటించే హీరో ఎవరనే చర్చ మొదటి నుండి ఆసక్తికరంగా మారింది.
Also Read : SSRMB29: రెండు భాగాలుగా రాజమౌళి- మహేశ్ సినిమా..?
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి రానా ఇలా పలువురి పేర్లు వినిపించాయి. కానీ అవేవీ నిజం కాదని కాంతారాలో నటించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి ఫిక్స్ చేసినట్టు గత రెండు రోజులుగా వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై అధికారంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పాత్రకు మొదట అనుకున హీరో కేజీఎఫ్ నటుడు యష్. హనుమాన్ మేకర్స్ ముందుగా హనుమాన్ పాత్రలో నటించేందుకు యష్ ను సంప్రదించారట. యష్ కూడా అందుకు సుముఖంగానే ఉన్నాడట. కానీ అనుకోని కారణాల వలన అక్కడ సెట్ అవలేదు. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టిని సంప్రదించి కథ, కథనాలు వినిపించగా హనుమాన్ రోల్ లో నటించేందుకు వెంటనే అంగీకాయించాడట. కానీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే హనుమాన్ మేకర్స్ సంప్రదించిన ఇద్దరు హీరోలు కన్నడ వారు కావడం. పాన్ ఇండియా బిజినెస్ కోసం అలా ప్లాన్ చేసారా లేదా టాలీవుడ్ నుండి వద్దు అనుకున్నారో ఏమో.