NTV Telugu Site icon

Big News : KGF -3కి మూహుర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్…హీరో ఎవరో తెలుసా..?

Untitled Design (25)

Untitled Design (25)

కన్నడ హీరో యశ్‌, ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. విడుదలకు ముందు ఎటువంటి అంచానాలు లేని ఈ చిత్రం మొదటి ఆట ముగిసిన తర్వాత సూపర్ హిట్ టాక్ తో తెలుగు, తమిళ్  బాక్సాఫీస్ దగ్గర చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ చిత్రంతో కన్నడ హీరో యశ్‌ ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరో అయ్యాడు. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ మారాడు.

కేజీఎఫ్ కు సిక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్-2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ చిత్ర ఎండింగ్ లో సిక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్టు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా తమిళ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ KGF-3 కథ రెడీ చేస్తున్నాడని వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించనున్నాడని వార్త. KGF సీరిస్ లో భాగంగా అజిత్ కుమార్ తో ప్రశాంత్ రెండు భాగాలను తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. రెండవ భాగంలో కథ ఎక్కడ అయితే ఆగిందో అక్కడి నుండి KGF -3 స్టార్ట్ కానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. అటు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ -2కూడా ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత అజిత్ చిత్రం స్టార్ట్ చేస్తాడా, ఎప్పుడన్నది క్లారిటీ రావాలి. KGF ఫ్రాంచైజ్ లో అజిత్ ఎంటర్ కానున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 

Also Read: Tollywood Talk: నెక్ట్స్ రూ.1000 కోట్ల హీరో ఎవరు..రేస్ లో ముగ్గురు హీరోలు.!

Show comments