ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘లవ్ టుడే’ సినిమాతో పాటు ‘డ్రాగన్’ సినిమాకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో, మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ హీరోగా, మమిత బైజు హీరోయిన్గా ఇప్పుడు ‘డ్యూడ్’ అనే ఒక సినిమా నిర్మించారు. కీర్తిస్వరన్ అనే ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ అయింది.
Also Read:Lokesh Kanagaraj : పవన్’తో అలాంటి సినిమా.. వామ్మో లోకేష్?
ఈ సినిమాకి తమిళంతో పాటు తెలుగులో కూడా చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, కొంత మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే, ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికర విషయం జరిగింది. అదేంటంటే, ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ 27 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. అందులో దాదాపు 22 కోట్ల రూపాయలు మొదటి రోజే వెనక్కి రాబట్టడం గమనార్హం. ఇక సెకండ్ డే కూడా తమిళనాడుతో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా గట్టి హోల్డ్ కనిపిస్తోంది. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ కి మరొక లక్కీ ప్రాజెక్టుగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.