NTV Telugu Site icon

Prabhas : రెబల్ స్టార్ రెండు సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ఇవే..

Untitled Design (13)

Untitled Design (13)

రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలితో గ్లోబల్ రేంజ్ కు చేరింది. ప్రభాస్ నటించే ఏ  సినిమా అయిన పాన్ ఇండియా భాషల్లోనే వస్తుంది. తాజాగా కల్కి తో రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన సినిమా స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి సెట్స్ పై ఉండగానే  రెండు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్. అందులో ఒకటి హాస్యం ప్రదానంగా ఉండే కథాంశంతో సినిమాలు తెరకెక్కించే మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమాను  పట్టాలెక్కించాడు.

Also Raed : Devara : దేవర నార్త్ అమెరికా 17 రోజుల అడ్వాన్స్ బుకింగ్స్.. కలెక్షన్స్ ఇవే..

ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రభాస్, కథానాయికలు, కొద్దిమంది హాస్యనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ముగ్గురి హీరోయిన్లు , ప్రభాస్ నడుమ హుషారైన సన్నివేశాలు చిత్రీకరస్తున్న దర్శకుడు మారుతి. వినాయక చవితి ఫెస్టివల్ నాడు కూడా విరామం లేకుండా, ఆదివారం కూడా బ్రేక్ లేకుండా అన్ స్టాపబుల్ గా రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది. వచ్చే వేసవిలో ఏప్రిల్‌ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఒకవైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ఇంకో సినిమాకి ఇటీవల కొబ్బరికాయ కొట్టాడు డార్లింగ్. ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఓ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తుంది.  ఈ సినిమాను రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా ఓపెన్ చేసారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి తమిళనాడులోని కరైకుడిలో ప్రారంభమవుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, స్వాతంత్య్రానికి సంబంధించిన కథాంశంతో వచ్చిన కొన్ని చిత్రాలను గతంలో కరైకుడిలో షూట్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ హను సినిమా కూడా అక్కడే ఓపెన్ గ్రౌండ్ లోషూట్ చేయబోతున్నారు.

Show comments