ప్రభాస్ ఫ్యాన్స్ సహా సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న రాజాసాబ్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్‌లో రూపొందించబడిన ఈ సినిమాని విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాల 34 సెకండ్ల పాటు సాగింది. పూర్తిగా వింటేజ్ ప్రభాస్‌ని వెనక్కి తీసుకొస్తున్నామని అభిమానులకు చెప్పడానికి ఎక్కువగా మారుతి ట్రై చేశాడు. ఒకపక్క ప్రభాస్ లోని కామెడీ టైమింగ్ వాడుకుంటూ, మరోపక్క ఆయనలో ఉన్న మాస్ యాంగిల్‌ని కూడా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు.
Also Read :MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల..
ట్రైలర్ కట్ అయితే ప్రస్తుతానికి మిక్స్డ్ రియాక్షన్స్ పొందుతోంది. అభిమానులు సహా కొంతమంది సినీ ప్రేమికులైతే ట్రైలర్ కట్ అదిరిపోయింది అంటుంటే, కొంతమంది మాత్రం అంతగా ఎక్కలేదని అంటున్నారు. అయితే ట్రైలర్‌ని తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేశారు. కొన్ని భాషల్లో ప్రభాస్ డబ్బింగ్ సరిగా సెట్ కాలేదని అంటున్నారు. తెలుగు ట్రైలర్ విషయానికి వస్తే, ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు అయితే కనిపిస్తున్నాయి. సిజి వర్క్స్ కూడా గతంతో పోలిస్తే కాస్త బెటర్ అని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే, ఈ ట్రైలర్ రాజాసాబ్ సినిమా మీద అంచనాలు పెంచేలానే ఉంది. గతంలో రిలీజ్ చేసిన టీజర్ కంటెంట్‌తో పోలిస్తే, ఈ కంటెంట్ ఎంగేజింగ్‌గానూ, ఇంకాస్త కథలోకి తీసుకువెళ్లే విధంగానూ కనిపిస్తోంది.
