Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్‌కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!

Prabhas Spirit Bold

Prabhas Spirit Bold

Prabhas Look in Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో తనదైన మార్క్ చూపించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో.. స్పిరిట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ అప్‌డేట్ వైరల్‌గా మారింది.

స్పిరిట్‌లో సందీప్ రెడ్డి వంగా తన గత సినిమాల కంటే మరింత డార్క్, బోల్డ్ ట్రీట్‌మెంట్‌ను చూపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రణబీర్ కపూర్ మూవీ యానిమల్‌ను మించే స్థాయిలో కొన్ని సన్నివేశాలను డిజైన్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమాలోని కొన్ని బోల్డ్ సన్నివేశాలు కథలో కీలకంగా నిలిచే అవకాశం ఉందట. ఆ మధ్య విమల్ థియేటర్‌లో షూట్ చేసిన కొన్ని బోల్డ్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నాయని టాక్.

ఇప్పటివరకు కనిపించని సరికొత్త మాస్ అవతార్‌లో ప్రభాస్‌ను సందీప్ రెడ్డి స్పిరిట్‌లో చూపించబోతున్నారట. ముఖ్యంగా ప్రభాస్ బేర్ బాడీతో కనిపించే సన్నివేశాలు సినిమాలో ఉండబోతున్నాయనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం. సందీప్ రెడ్డి వంగా తన హీరోల పాత్రలను చాలా ఇంటెన్స్‌గా, డిఫరెంట్ షేడ్స్‌తో చూపింస్తుంటాడు. ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఆయన ఎలాంటి ప్రయోగం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్పిరిట్ విషయంలో కూడా హీరో పాత్ర, లుక్, ట్రీట్‌మెంట్‌పై దర్శకుడు ఎలాంటి రాజీ పడటం లేదనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్‌ ద్వారా స్పిరిట్‌పై సందీప్ రెడ్డి బోల్డ్ హింట్స్ ఇచ్చేశాడు. దీంతో సినిమాలో ప్రభాస్‌ను సందీప్ ఏ రేంజ్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారనే ప్రశ్న మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు సందీప్ స్టైల్ ఎలా జతకానుందనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న బోల్డ్ సీన్స్, బేర్ బాడీ లుక్ వంటి వివరాలకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి వీటిని ప్రస్తుతానికి సోషల్ మీడియా ప్రచారం, ఇండస్ట్రీ టాక్‌గానే చూడాలి. మరి సందీప్–ప్రభాస్ కాంబినేషన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.