పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. కొంపల్లి, కోటి విమెన్స్ కాలేజీ, అజీజ్ నగర్, బాలనగర్ విమల్ థియేటర్, ఖైరతాబాబ్.. ఇలా హైదరాబాద్‌లోనే ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు.
ఈ షూటింగ్‌లో ప్రభాస్ ఎండను సైతం లెక్క చేయకుండా పాల్గొంటున్నాడు. అంటే, హైదరాబాద్ సీన్స్ సినిమాలో ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ లెక్క ప్రకారం చూస్తే.. స్పిరిట్ షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారా? అనే సందేహాలు రాకమానదు. నిజానికి స్పిరిట్ సినిమా ఇంటర్నేషన్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుందనే టాక్ ఉంది. అంతేకాదు.. ఫస్ట్ షెడ్యూల్‌ని విదేశాల్లోనే ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ కట్ చేస్తే హైదరాబాద్‌లోనే మెజారిటీ పార్ట్ పూర్తి చేసేలా దూసుకుపోతున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అందుకే.. హైదరాబాద్ సెంటర్‌గా ఖాకీ యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తున్నట్టు ఉన్నాడు డార్లింగ్. మరి ఇంటర్నేషనల్ అన్నారు కదా..? అంటే అది హైదరాబాబ్ పోర్షన్ అయిపోయాక ఉండొచ్చు. ఏదేమైనా.. స్పిరిట్ షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తుండడం.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్ హైప్ ఇస్తోంది. కాగా వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ రిలీజ్ కానుంది.

