పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్‘. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రం కోసం ఏకంగా రెండు నెలల పాటు ఒక భారీ లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసి జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుతున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే కొంపల్లి, అజీజ్ నగర్, మరియు కోటి ఉమెన్స్ కాలేజ్ వంటి ప్రముఖ ప్రాంతాలలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఈ రోజు హైదరాబాద్ లోని బాలానగర్ విమల్ థియేటర్ లో చేయబోతున్నారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసారు మేకర్స్. ఈ రోజు జరగబోయే షూట్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నారట. ఈ న్యూస్ వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరోను చూడాలని థియేటర్ వద్దకు చేరుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో రేబలోడి కటౌట్‌కు సందీప్ మార్క్ ఎలివేషన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌లో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ తృప్తి దిమ్రి, విలన్ పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ కూడా పాల్గొంటున్నారు. సందీప్ టేకింగ్, ప్రభాస్ కటౌట్ తోడవ్వడంతో ‘స్పిరిట్’ ఎప్పుడు వచ్చిన రికార్డులు సృష్టించడం ఖాయం.
