Prabhas: ప్రభాస్ ఓ బాక్సాఫీస్ రికార్డ్ బుక్.. టచ్ చేయడం అంతా ఈజీ కాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా ‘పాన్-ఇండియా’ స్థాయిలో దూసుకుపోతోంది. ఈ కొత్త ఒరవడిని సృష్టించి, దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆయన క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. చెప్పాలంటే.. ఆయన ఓ బాక్సాఫీస్ రికార్డ్ బుక్. తాజాగా ‘ధురంధర్ 2’ సంచలన వసూళ్ల సాధిస్తున్న నేపథ్యంలో.. డార్లింగ్ క్రేజ్ ఎలా ఉందో మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రూ. 500 కోట్ల రూపాయల గ్రాస్, నెట్ వసూళ్లను సాధించిన అత్యధిక సినిమాలు ఉన్న కథానాయకుడిగా ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. ప్రభాస్ ఖాతాలో ఏకంగా నాలుగు చిత్రాలు 500 కోట్ల మార్కును దాటడం విశేషం.
Also Read:Akshaye Khanna: ప్రశాంత్ వర్మ ‘యూనివర్స్’లో ధురంధర్ విలన్..
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
- Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
- P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కంక్లూజన్’, ‘కల్కి 2898 AD’, ‘సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్’ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ విజయాలతో దేశంలో మరే ఇతర హీరోకి సాధ్యం కాని రీతిలో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ జాబితాలో ప్రభాస్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్‌లు ఉన్నారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు 500 కోట్ల క్లబ్‌లో చేరగా, రణవీర్ సింగ్ ఇటీవలి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ధురంధర్’ చిత్రాలతో ఈ ఫీట్ సాధించారు. ఇక వెయ్యి కోట్ల సినిమాల పరంగా చూస్తే.. ప్రభాస్ రెండు, షారుఖ్ రెండు, రణ్‌వీర్ సింగ్‌కి రెండు చిత్రాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభాస్ సాధించిన రికార్డుల ముందు వీరు వెనుకబడే ఉన్నారు. ఇక రాబోయే సినిమాలు ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2లతో ప్రభాస్ సృష్టించబోయే రికార్డ్‌లను టచ్ చేయడం ఏ హీరోకైనా అంతా ఈజీగా ఉండదనే చెప్పాలి.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్‌కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..