NTV Telugu Site icon

Rebal Star : బర్త్ డే కానుకగా ప్రభాస్ సినిమాల రీరిలీజ్ ఫెస్టివల్

Rajasaab

Rajasaab

అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు రానుంది. ఈ సారి బర్త్ డే వేడుకలను భారీ స్థాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల వచ్చిన కల్కి తో సూపర్ హిట్ కొట్టడమే కాకుండా మరోసారి రూ. 1000 కోట్లు వసూళ్లు సాదించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కల్కి హిట్ తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈసారి రెబల్ స్టార్ బర్త్ డేను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ప్రభాస్ పేరు ట్రెండ్ అయ్యేలా బర్త్ డే ట్రెండ్ కు ప్లాన్ చేస్తున్నారు రెబలియన్స్.

Also Read : Tollywood : మైత్రీ మూవీస్ తో చేతులు కలిపిన బాలీవుడ్ నిర్మాణ సంస్థ..?

ఇదిలా ఉండగా రెబల్ స్టార్ నటించిన సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ తో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు సదరు మేకర్స్. ముందుగా ఈ నెల 19, 20 తేదీల్లో సలార్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా క్షణాల్లో సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక అక్టోబరు 22న ప్రభాస్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ MR  పర్ ఫెక్ట్ ను రీరిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. అలాగే ఈ నెల 22, 22 తేదీల్లో కర్ణాటకలో ఛత్రపతి సినిమాను రీరిలీజ్ లో చేస్తున్నారు. ఇక డార్లింగ్ బర్త్ డే 23న టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈశ్వర్ ను రీరిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు రాధేశ్యామ్, సాహూ సినిమాలను జపాన్ లో స్పెషల్ షోస్ ప్లాన్ చేసారు ఫ్యాన్స్.