రాజు, రాముడు, రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు క్యారెక్టర్ ఏదైనా సరే ప్రభాస్ కటౌట్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బాహుబలిలో రాజుగా, ఆదిపురుష్‌లో రాముడిగా, సలార్‌లో రాక్షసుడిగా ఊచకోత కోసిన ప్రభాస్ ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా మారబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో డిఫరెంట్ జానర్‌లో సినిమాలు చేస్తు వస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాల దర్శకులంతా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే.
Also Read : Daaku Maharaaj : గ్లోబల్ లెవల్ లో డాకు మహారాజ్ ట్రేండింగ్.. దటీజ్ బాలయ్య
ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 లైన్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు కేవలం ప్రచారం మాత్రమే అనుకున్న వార్తను నిజం చేస్తూ ప్రశాంత్ వర్మతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు డార్లింగ్. హనుమాన్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ చేస్తున్నాడు. అలాగే బాలయ్య వారసుడు మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మోక్షు ప్రాజెక్ట్ లేనట్టేనని వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో పాన్ ఇండియా స్టార్‌ను ప్రశాంత్ మెప్పించడం విశేషం. గతంలో ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో బ్రహ్మరాక్షస్ అనే సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు రాగా అది వర్కౌట్ కాలేదు. దీంతో ప్రభాస్ దగ్గరికి ఆ కథ వెళ్లడం ఓకె చెప్పడం జరిగిపోయినట్టుగా టాలీవుడ్ టాక్. బ్రహ్మరాక్షస్ స్టోరీనే ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చి తెరకెక్కించనున్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా జరిగినట్టుగా సమాచారం. మహాశివరాత్రి కానుకాగా నేడు ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించనుంది.