NTV Telugu Site icon

Prabhas : TFI కు ధీటుగా ప్రభాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ..?

Daring

Daring

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్ గా మరేఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రజాకార్ల నాటి కాలానికి చెందిన కథ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేస్తున్నాడు.  వీటితో పాటు కల్కి -2 ఎలాగూ ఉండనే ఉంది.

Also Read : Allu Arjun : ఇది పుష్ప గాడి రేంజ్.. రికార్డు బుకింగ్స్

ప్రభాస్ మరోసారి కన్నడ టాప్ నిర్మాణ సంస్థ హోంబాలే బ్యానర్ లో మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ -2 తో పాటు,  టాలీవుడ్ జీనియస్ ప్రశాంత్ వర్మ తో ఓ సినిమా, తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలు హోంబాలే ఫిల్మ్స్ నిర్మించనుంది. ఒకసారి ప్రభాస్ చేస్తున్న సినిమాలను పరిశీలిస్తే  రెబల్ స్టార్  ప్రభాస్ టాలీవుడ్ కు ధీటుగా  సొంతంగా  ప్రభాస్  ఫిల్మ్ ఫ్యాక్టరీ ( PFI ) నడుపుతున్నట్టు ఉంది. జాగ్రత్తగా గమనిస్తే మన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కలిసి కూడా ప్రభాస్ చేస్తున్నన్ని సినిమాలు చెయ్యట్లేదు. ఇలా తనకు తానుగా ఒక సెపరేట్ ఇండస్ట్రీ తో పాటు మార్కెట్ ను బిల్ట్ చేస్తున్నాడు డార్లింగ్. ఏదేమైనా ప్రభాస్ నుండి రాబోతున్న సినిమాలతో కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులతో పాటు తనకు తానుగా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నాడు  రెబల్ స్టార్ ప్రభాస్.

Show comments