NTV Telugu Site icon

Prabhas : ప్రభాస్‌ దేశంలోనే పెద్ద హీరో అని చెప్పలేం : దగ్గుబాటి సురేష్

Daggubati

Daggubati

టాలీవుడ్‌ టాప్ నిర్మాతలలో ఒకరు దగ్గుబాటి సురేశ్‌ బాబు. తాజాగా సురేష్ బాబు ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలఫై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాట్లాడుతూ ” ఈ హీరో పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్ కూడా వస్తుంది. కానీ ఒక్కోసారి స్టార్‌ హీరోల సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. సో ఓన్లీ కలెక్షన్ల ఆధారంగా పెద్ద హీరో ఎవరు అనేది నిర్ణయించలేం. టాలీవుడ్‌లో హీరోలలో పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు, అలా అని ప్రభాస్‌ దేశంలోనే పెద్ద హీరో అని చెప్పడానికి లేదు. ‘బాహుబలి’,నుండి ఇటివల రిలీజ్ అయిన ‘కల్కి’కి మధ్యలో సలార్, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు ఆడలేదు. అలాగే ఆంధ్రాలో పవన్‌ కల్యాణ్‌కు ఫాలోయింగ్‌ ఉంది. అలాగని ఏ సినిమా తీసినా ప్రేక్షకులు చూస్తారని అనుకోకూడదు. గతంలో ఆయన తీసిన ‘జానీ’, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాత వాసి ఫ్లోప్స్ గా మిగిలాయి. తెలుగులో రూ.100 కోట్లు సాధించే హీరోలు చాలామందే ఉన్నారు’.

Also Read :SK25 : ఆ సినిమా నుండి తప్పుకున్నసూర్య, లోకేష్ కనకరాజ్..

విజయ్‌, అజిత్‌లు సినిమాలు ఆపేస్తే తమిళ పరిశ్రమ ఏంటనే దానిపై మాట్లాడుతూ . “అజిత్‌, విజయ్‌, రజనీకాంత్‌ వీరిలో ఎవరు పెద్ద హీరో ఎవరంటే  ఎవరూ చెప్పలేరు.  కొందరు  స్టార్‌లు సినిమాలు మానేసినంత మాత్రాన చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం ఏమి ఉండదు.  ఉదాహరణకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించినప్పుడు సంగీత ప్రపంచం ఏమైపోతుందో అని అందరూ అనుకున్నారు. అదేం ఆగిపోలేదు జరగలేదు కదా, సో ఇక్కడ కూడా స్టార్‌ హీరోలు సినిమాలు ఆపేస్తే యంగ్ హీరోలు తర్వాత స్టార్స్‌గా ఎదుగుతారు’’ అని అన్నారు.