Site icon NTV Telugu

Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!

Prabhas, Spirit, Fauzi, Kalki 2, Salaar 2,sandeep Reddy Vanga, Hanu Raghavapudi,prashanth Neel, Nag Ashwin

Prabhas, Spirit, Fauzi, Kalki 2, Salaar 2,sandeep Reddy Vanga, Hanu Raghavapudi,prashanth Neel, Nag Ashwin

Prabhas: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు, మరోవైపు విభిన్న కథాంశాలతో ఫ్యాన్స్‌కు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరి వరకు నిర్విరామంగా కొనసాగనుంది. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరోవైపు, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘కల్కి 2898 AD’ పార్ట్-2 అప్పుడే పట్టాలెక్కేసింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Megastar: రామ్ చరణ్‌ కంటికి సర్జరీ.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

ఇక వీటితో పాటు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ షూటింగ్ కూడా అత్యంత వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ తీసుకుంటే.. ఒక్క సలార్ సీక్వెల్ తప్ప మిగతా సినిమాలన్నీ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. నిజానికి ‘సలార్ 2’ పై ఎక్కడా లైని హైప్ ఉంది. కానీ, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా కమిట్ అవడం, ప్రభాస్ భారీ లైనప్‌ ఉండడంతో వెనక్కి వెళ్లింది. ఇది కూడా మొదలైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఎన్టీఆర్‌-నీల్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ‘సలార్ 2’ పట్టాలెక్కే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రభాస్.. స్పిరిట్, కల్కి 2, ఫౌజీ చిత్రాలను పూర్తి చేయనున్నాడు. కానీ, సలార్ సీక్వెల్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Also Read: Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

Exit mobile version