Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్‌పై షాకింగ్ అప్‌డేట్స్!

Kalki 2

Kalki 2

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి భాగంలో వదిలిన ప్రశ్నలకు సమాధానాలు, అలాగే కురుక్షేత్ర సంగ్రామం తాలూకా విజువల్స్ పార్ట్ 2లో ఎలా ఉండబోతున్నాయా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అలాగే పార్ట్1 ఎండింగ్‌లో ప్రభాస్ పాత్ర ‘కర్ణుడు’ అని రివీల్ చేయడంతో, రెండో భాగం పూర్తిగా కర్ణుడి నేపథ్యం మరియు పురాణ గాథల చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. సీక్వెల్‌లో పౌరాణిక సన్నివేశాల నిడివి ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్) వర్సెస్ ప్రభాస్ మధ్య యుద్ధం పీక్స్‌లో ఉంటుందని టాక్. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సంచలన వార్తలు బయటకు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే కొత్త షెడ్యూల్‌లో ఆయన జాయిన్ కానున్నారని, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సీక్వెల్‌కు ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే అమితాబ్, కమల్ హాసన్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.