Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్‌పై షాకింగ్ అప్‌డేట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి భాగంలో వదిలిన ప్రశ్నలకు సమాధానాలు, అలాగే కురుక్షేత్ర సంగ్రామం తాలూకా విజువల్స్ పార్ట్ 2లో ఎలా ఉండబోతున్నాయా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అలాగే పార్ట్1 ఎండింగ్‌లో ప్రభాస్ పాత్ర ‘కర్ణుడు’ అని రివీల్ చేయడంతో, రెండో భాగం పూర్తిగా కర్ణుడి నేపథ్యం మరియు పురాణ గాథల చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. సీక్వెల్‌లో పౌరాణిక సన్నివేశాల నిడివి ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్) వర్సెస్ ప్రభాస్ మధ్య యుద్ధం పీక్స్‌లో ఉంటుందని టాక్. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సంచలన వార్తలు బయటకు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే కొత్త షెడ్యూల్‌లో ఆయన జాయిన్ కానున్నారని, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సీక్వెల్‌కు ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే అమితాబ్, కమల్ హాసన్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
-
Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
-
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
-
418 Movie: ప్రశాంత్ నీల్ హరర్ థ్రిల్లర్ ‘418’కు ‘ఏ’ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?