డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కొలిగ్స్‌తో పోటీ పడితే ఏ మజా వస్తుందనుకున్నాడో ఏమో అనుకున్నట్టున్నాడు. ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోలతో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ భజరంగీ బాయ్‌జాన్‌కు వారం రోజులు ముందు ఎదురెళ్లి కండల వీరుడి ధౌజండ్ క్రోర్ టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలి, భజరంగీ సినిమాలకు విజయేంద్ర ప్రసాదే రైటర్ కావడం విశేషమైతే వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రావడం యాదృచ్చికం.
Also Read : Rakshmika : క్రేజ్ తో నెగిటివిటిని కూడా కొనితెచ్చుకుంటున్న రష్మిక మందన్న
బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగింది. భారీ స్థాయిలో క్రేజ్,ఫేమ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. దీంతో సినిమా ప్లాపైనా పెట్టుబడి డబ్బులు వచ్చేంత క్రేజ్ వచ్చింది. సాహో నుండి ఆదిపురుష్ వరకు ప్లాపులు వెంటాడుతున్న వేళ సలార్‌తో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మూవీ ఢంకీని డైరెక్ట్‌గా ఢీ కొట్టాడు డార్లింగ్. 2023 చివరిలో జరిగిన ఈ బాక్సాఫీస్ వార్‌ని దేశమంతా నార్త్, సౌత్ ఇష్యూగా చూసింది. ఈ రేసులో డార్లింగ్ ప్రభాస్ బాక్సాఫీసును రూల్ చేసాడు. అంతే కాదు ఢంకీతో థౌజండ్ క్రోర్ కలెక్షన్స్‌తో హాట్రిక్ కొట్టాలని చూసిన షారుక్‌ఖాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈసారి ప్రభాస్, వచ్చే 2026లో సౌత్ ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరోను టార్గెట్ చేస్తున్నాడు. ఈసారి ఇళయ దళపతి విజయ్ జన నాయగన్‌తో పోటీకి దిగుతున్నాడు. తమిళనాడు, కేరళలో విజయ్ ది డామినేషన్ కాగా, తెలుగు, హిందీలో ప్రభాస్ ది హవా. అయితే దళపతి విజయ్ చివరి సినిమా అనే సింపథీతో వస్తున్నాడు. కల్కి తర్వాత పూర్తి విభిన్నమైన ఇప్పటి వరకు టచ్ చేయని హారర్ కామెడీ జానర్‌లో రాజాసాబ్‌తో బాక్సాఫీస్ వార్‌కి రెడీ అవుతున్నాడు డార్లింగ్. మరీ ఈ సారి ప్రభాస్ దళపతిని ఢీ కొట్టి పై చేయి సాధిస్తాడా.. చూద్దాం…
