డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కొలిగ్స్‌తో పోటీ పడితే ఏ మజా వస్తుందనుకున్నాడో ఏమో అనుకున్నట్టున్నాడు. ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోలతో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ భజరంగీ బాయ్‌జాన్‌కు వారం రోజులు ముందు ఎదురెళ్లి కండల వీరుడి ధౌజండ్ క్రోర్ టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలి, భజరంగీ సినిమాలకు విజయేంద్ర…