Prabhas: ఈసారి థియేటర్లో వింటేజ్ డార్లింగ్‌ను చూసి పండగ చేసుకునేలా.. రాజాసాబ్‌ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మారుతి. చాలా కాలం తర్వాత డార్లింగ్ నుంచి వస్తున్న ఎంటర్టైనింగ్ మూవీ కావడంతో.. రాజాసాబ్ పై మంచి అంచనాలున్నాయి. పైగా ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ, ఫైట్స్, సాంగ్స్ అదిరిపోతాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా పాటలు మాత్రం ఓ రేంజ్లో ఉంటాయని అంటున్నారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట.
Read Also: Pawan Kalyan Birthday: మెగాస్టార్ కి దెబ్బ.. మరి ‘తమ్ముడు’ పరిస్థితేంటి..?
మొత్తంగా ఈ చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని సమాచారం. అందులో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇంట్రడక్షన్ సాంగ్ మామూలుగా ఉండదట. అలాగే.. ఒక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ కూడా అదిరిపోతుందట. ఇక ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లతో ఉండే స్పెషల్ సాంగ్.. థియేటర్లో విజిల్స్ వేసేలా ఉంటుందట. అలాగే.. మాళవిక మోహనన్‌తో మరో మాస్ డ్యూయెట్, ఒక థీమ్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. కాబట్టి.. రాజాసాబ్ మ్యూజికల్ మోత మామూలుగా ఉండదనే చెప్పాలి. ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండగా.. 2026 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి రాజాసాబ్ ఎలా ఉంటుందో చూడాలి.