Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?

Prabhas Birthday Special

Prabhas Birthday Special

Prabhas Birthday Special : ‘ది రాజా సాబ్’ రిజల్ట్ తేడా కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డ మాట వాస్తవమే. ఆ దెబ్బను హను రాఘవపూడితో చేస్తున్న ‘ఫౌజీ’తో గట్టిగా కొట్టి కవర్ చేస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్‌ను స్క్రీన్ మీద చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు మళ్లీ నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. మొదట్లో ఈ సినిమా ఆగస్టులో వస్తుందన్నారు, ఆ తర్వాత కాదని డిసెంబర్‌కు మార్చారు. తీరా చూస్తే ఇప్పుడు డిసెంబర్‌లో కూడా సినిమా రావడం లేదని మేకర్స్ చేతులెత్తేశారు. అసలు ఎప్పుడు వస్తుందో ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. డార్లింగ్ కమిట్ అయిన ప్రాజెక్టులు అన్నీ ఇలా అంతకంతకూ వెనక్కి పోతుండటంతో, ఈ ఏడాది కొత్త సినిమాతో ప్రభాస్‌ను థియేటర్లలో చూడటం కుదిరేలా లేదు.

సినిమా లేట్ అవుతున్నా, అక్టోబర్ 23న వచ్చే డార్లింగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఒక చిన్న ఊరట ఇచ్చే న్యూస్ చెప్పారు. ఫౌజీ నుంచి మామూలు టీజర్ కాకుండా, అంతకుమించిన ఒక సాలిడ్ కంటెంట్ వీడియోను వదలడానికి రెడీ అవుతున్నారు. కనీసం ఈ వీడియోతోనైనా సినిమా ఎప్పుడు వస్తుందో చెబుతారా అని ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. కొత్త సినిమా రాకపోయినా బర్త్‌డే రోజున థియేటర్లలో రచ్చ చేయడానికి రెండు పాత బ్లాక్‌బస్టర్లు మళ్లీ లైన్లోకి వస్తున్నాయి. ప్రభాస్ కెరీర్‌లోనే పెద్ద టర్నింగ్ పాయింట్ అయిన ‘వర్షం’ అక్టోబర్ 23న రీ-రిలీజ్ అవుతుండగా, జక్కన్నతో చేసిన కల్ట్ క్లాసిక్ ‘ఛత్రపతి’ని 4K వెర్షన్‌లో అదే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా తీస్తున్న హై ఓల్టేజ్ మూవీ ‘స్పిరిట్’ నుంచి ఇప్పటివరకు ఒక చిన్న లుక్ తప్ప ఇంకేమీ బయటకు రాలేదు. కనీసం ఈ బర్త్‌డేకైనా సందీప్ నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందా, అటు నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ నుంచి ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫౌజీ వాయిదా పడ్డా, ఈ అప్‌డేట్స్‌తోనైనా ప్రభాస్ ఫ్యాన్స్ బర్త్‌డేని ఎంజాయ్ చేస్తారేమో చూడాలి.