Prabhas: వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతున్న ప్రభాస్ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్. ఆయన సినిమాల రిలీజ్ డేట్ల గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపిస్తున్న టైమ్‌లో.. డార్లింగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలాంటి క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి ఒకేసారి రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి దిగబోతున్నాయి.
హను రాఘవపూడితో చేస్తున్న సినిమాను నిజానికి ఈ ఏడాదిలోనే బాక్సాఫీస్ ముందుకు తీసుకురావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా నాన్ స్టాప్‌గా సాగుతోంది. ఇక దీని తర్వాత అందరూ పిచ్చెక్కిపోయేలా ఎదురుచూస్తున్న కాంబినేషన్ సందీప్ రెడ్డి వంగా సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాను అదే ఏడాది సెకండ్ హాఫ్‌లో అక్టోబర్ 29న దీపావళి పండక్కి గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే టీమ్ తేల్చిచెప్పింది.
మరో నాలుగు నెలల్లోనే ప్రభాస్ హను సినిమా పనులు ముగించేసి, నేరుగా ‘స్పిరిట్’ సెట్స్ లోకి వెళ్లబోతున్నారు. ఇంకోవైపు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ షూటింగ్ కూడా వచ్చే ఏడాది జూన్ నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉందన్న వార్తలు తోడవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. వచ్చే ఏడాది ఒకేసారి ఈ రెండు సినిమాలు వస్తుండటంతో థియేటర్లలో డార్లింగ్ రచ్చ మామూలుగా ఉండదని అంతా అనుకుంటున్నారు.

