యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించింది.
Also Read : Prashant Varma : జై హనుమాన్ ను వదలుకున్న స్టార్ హీరో..!
ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నైజాం రైట్స్ కొనుగోల చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను పలువురికి చూపించారని అలా చూసి బావుందని చెప్పిన ఒక స్టార్ డైరెక్టర్ ఇచ్చిన నమ్మకంతో అలాగే కంటెంట్ మీద నమ్మకంతో రెండు రోజులు ముందుగానే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మైత్రీ నిర్మాతలు. అయితే పొట్టేల్ సినిమాలో అజయ్ రోల్ చాలా సర్ప్రైజింగ్ ఉంటుందట. అజయ్ కెరియర్ లోనే ది బెస్ట్ రోల్ అంటున్నారు చుసిన వాళ్ళు. నేడు ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మలయాళ నటి సంయుక్త మీనన్ ఆథిదిగా నేడు AAA సినిమాలో విడుదల చేయనున్నారు. మరోవైపు విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీమ్. తాజాగా విమానంలో పొట్టేల్ పాంప్లేట్లు పంచుతూ హీరోయిన్ అనన్య నాగళ్ల, హీరో కృష్ణ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.