Vihari: ఓటీటీలోకి దిగ్గజ ట్రావెల్ షో.. సరికొత్త రికార్డులకు తెరతీస్తున్న విహారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచిన ప్రముఖ ట్రావెల్ షో ‘విహారి’ ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. గత 18 ఏళ్లుగా ప్రయాణ ప్రియులను విదేశాలు, దేశంలోని అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తూ అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ షో.. ఇప్పుడు సరికొత్త ఓటీటీ యాప్‌గా మారబోతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అత్యంత వైభవంగా ఈ ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. 2004లో ‘మా టీవీ’లో చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ‘విహారి’ ద ట్రావెలర్.. ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ నేడు ఓటీటీ స్థాయికి ఎదిగింది. వ్యవస్థాపకులు, దర్శకులు ఏ.ఎల్. నితిన్ ఈ వినూత్న యాప్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సర్వం సిద్ధం చేశారు. అప్పట్లో కరుణ, స్నిగ్ధ లాంటి ప్రముఖ యాంకర్లతో కలర్‌ఫుల్ ఎపిసోడ్స్ అందించిన విహారి.. ఇప్పుడు మరింత అప్‌గ్రేడ్ అయింది. ఈ నవంబర్ నుంచి బుల్లితెర లెజెండ్రీ యాంకర్ సుమతో కలిసి సరికొత్త, ఇన్నోవేటివ్ ఎపిసోడ్స్‌ను టెలికాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు గ్లామర్ అండ్ ఎనర్జిటిక్ టచ్ ఇస్తూ ప్రముఖ నటి, యాంకర్ శ్రీ సత్యను ఓటీటీ హోస్ట్‌గా ఎంపిక చేయడం విశేషం. ఈ వేడుకకు సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్, వజ్ర కన్స్ట్రక్షన్స్ అధినేతలు రాజు, శ్వేతలతో పాటు యాంకర్ శ్రీ సత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు ఏ.ఎల్. నితిన్ మాట్లాడుతూ.. ప్రయాణాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ ఓటీటీ యాప్ ఒక పూర్తిస్థాయి గైడ్‌లా ఉంటుందని, నవంబర్‌లో ఈ యాప్ అధికారికంగా లాంచ్ కానుందని వెల్లడించారు. తక్కువ బడ్జెట్లో ఎక్కడ బెస్ట్ హోటల్స్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది అనే పూర్తి వివరాలతో సాగే ఈ ప్రయాణం ఓటీటీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
తాజావార్తలు
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!