నిత్యం అనేక ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ మరికొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో, ఈ సినిమాని మొదట డైరెక్ట్ చేసిన క్రిష్ పేరును ప్రస్తావిస్తూ పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసింది. ఒరిజినల్ కంటెంట్‌తో, ఆథెంటిక్ స్క్రిప్ట్‌లతో సినిమాలు చేసే క్రిష్ లాంటి డైరెక్టర్‌కు సరైన గుర్తింపు రాలేదని, కానీ అనేక కాపీరైట్ ఇష్యూస్, పిఆర్ స్టంట్స్‌తో నిత్యం వార్తల్లో ఉండే ఒక దర్శకుడికి మాత్రం సక్సెస్ వచ్చిందని, త్రివిక్రమ్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేసింది.
Also Read:Icon: అదే కథ.. మరో స్టార్ హీరో!
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అనేకసార్లు వాయిదా పడి, చివరికి ఈ నెల చివరిలో రిలీజ్ కాబోతోంది. ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ చేసినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టగా, అనేక వాయిదాలు పడుతున్న నేపథ్యంలో ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Screenshot 2025 07 02 210004
