టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా, దాని వెనుక నటి పూనమ్ కౌర్ స్పందన ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను టార్గెట్ చేస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా వేస్తున్న పరోక్ష బాణాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా పవన్ కళ్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వార్తలు బయటకు వచ్చిన తరుణంలో.. పూనమ్ కౌర్ చేసిన ఓ మిస్టరీ కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతోంది. పవన్ కళ్యాణ్‌కు, తనకు మధ్య త్రివిక్రమ్ అడ్డుగోడలా నిలిచారని, పవన్ చుట్టూ ఓ కోట కట్టి తనను ఆ దరిదాపుల్లోకి రాకుండా చేశారనేది పూనమ్ కౌర్ ఎప్పటి నుంచో చేస్తున్న ప్రధాన ఆరోపణ. అసలు వీరి ముగ్గురి మధ్య ఏం జరిగింది? త్రివిక్రమ్ ఇందులో ఎలాంటి పాత్ర పోషించారు? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. పూనమ్ కూడా ఎప్పుడూ పూర్తి వివరాలను బయటపెట్టకుండా, ఒక్కోసారి పేర్లు ప్రస్తావిస్తూ.. మరోసారి పరోక్షంగా చురకలు అంటిస్తూ తన అసహనాన్ని వెళ్లగక్కుతూనే ఉన్నారు.
ప్రస్తుతం పవన్, అన్నా లెజినోవా విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తున్న వేళ, ఓ నెటిజన్ పూనమ్ కౌర్ పాత పోస్ట్‌ను తవ్వి తీశాడు. “మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం” అంటూ ఆమెకు మద్దతుగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కామెంట్ పెట్టాడు. దీనికి పూనమ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. ఆ నెటిజన్ కామెంట్‌కు స్పందిస్తూ.. “భవిష్యత్తులో నిజం మరింత గెలిచి తీరుతుంది (మరిన్ని నిజాలు బయటకు వస్తాయి). ప్రతి ఒక్కరికీ మనశ్శాంతి, సమస్యల నుంచి పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాను” అంటూ పూనమ్ కౌర్ మరో క్రిప్టిక్ పోస్ట్ వదిలారు. ఈ ట్వీట్‌లో ఆమె ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును గానీ, ఆయన విడాకుల ప్రస్తావనను గానీ నేరుగా తీసుకురాలేదు. కానీ, సరిగ్గా పవన్ వ్యక్తిగత జీవితంలో ఇంతటి కీలక పరిణామం జరిగిన వెంటనే “ముందు ముందు మరిన్ని నిజాలు బయటకు వస్తాయి” అని ఆమె అనడం ఖచ్చితంగా పవన్‌ను ఉద్దేశించేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లూ గుప్పిట్లో దాచిన ఆ రహస్యాలను పూనమ్ భవిష్యత్తులో ఎప్పుడు బయటపెడుతుందో, ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి!
🙏
Truth shall triumph a little more in future ,Wishing only #Peace and resolve for everyone.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 11, 2026

