NTV Telugu Site icon

Pooja Hegde : ఎవ‌రు అవకాశంమిస్తే వారే ముఖ్యం నాకు

Untitled Design (72)

Untitled Design (72)

టాలీవుడ్ లో ‘ఒక లైలాకోసం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే .. ‘ముకుంద’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి. దీంతో బిగినింగ్‌లోనే బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ, ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ కాలం కలిసి రాలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి గత మూడు సంవత్సరాలుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. రాను రాను తీసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో పూజ కి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చింది పూజ. వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ తన కెరీర్ గురించి కీలకమైన విషయాలు పంచుకుంది..

Also Read: Actor : పెంపుడు కుక్క కోసం కట్టుకున్న భార్యను వదిలేసిన స్టార్ యాక్టర్..

పూజ మాట్లాడుతూ.. ‘ఛాన్స్ ఇస్తుంది ఉత్తరాది లేదా ద‌క్షిణాది అనే విభేధం నాకు లేదు. మ‌న‌కు ఎవ‌రు అవ‌కాశాలిస్తారో వారే ముఖ్యం. త‌క్కువ అవ‌కాశాలున్న టైంమ్ లోనే, నేను నిరంతరం కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. ఇది ఒక ఉన్నత ప్రయాణం. ప్రతి సినిమా నాకు చాలా ముఖ్యం. ఎంచుకుంటే మూవీస్ మనల్ని ఎదిగేలా చేయగలవు, నాశ‌నం చేయగలవు. మ‌రో అవ‌కాశం రావాలంటే ఇప్పుడు విజ‌యం సాధించ‌డం ముఖ్యం. అందుకే నేను నా పనిని ఎప్పుడూ తేలికగా తీసుకోను. నేను బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. నా కొన్ని దక్షిణాది సినిమాలు హిందీ ప్రేక్షకులను చేరుకున్నాయని తెలుసి ఆశ్చర్యపోయా. కనుక మ‌న‌ల్ని ఎవరు చూస్తున్నారో మ‌న‌కు ఎప్పటికీ తెలియదు. అలాగే మ‌న‌లో ఏదో ఒక ప్రత్యేకతను ప్రజ‌లు గ‌మ‌నిస్తారు. అందుకే భాష ఏదైనా సరే మంచి పాత్రల‌ను పోషించ‌డ‌మే నా లక్ష్యం. కెరీర్‌లో ఎదిగే క్రమంలో చాలా సినిమాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అందుకే క‌థ‌ల్ని పాత్రల్ని ఆలోచించి ఎంపిక చేసుకుంటున్నాను’ అని తెలిపింది పూజా హెగ్డే .