Site icon NTV Telugu

Pooja Hegde : పాత పరిచయాలతో, మళ్లీ టై అప్ అవుతున్న పూజా హెగ్డే ?

Poja Hegde

Poja Hegde

కోలీవుడ్‌లో పూజా హెగ్డే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘రెట్రో’ సినిమాతో అమ్మడు డి గ్లామరస్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. అనుకునంత కమ్‌బ్యాక్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం పూజా తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటిస్తున్న ‘జననాయకన్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇకపోతే ‘కాంచన 4’ మూవీ లోనూ పూజా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా ముగియనుండగా.. ప్రస్తుతం ఆమె దగ్గర కొత్త సినిమాలేమీ లేవన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఇక రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో కేవలం ప్రత్యేక పాత్రలో మాత్రమే కనిపించనుంది. దీంతో టాలీవుడ్‌పై మళ్లీ దృష్టి పెట్టిందట ఈ బుట్టబోమ్మ.

Also Read : Retro : సూర్య ‘రెట్రో’ వెబ్ సిరీస్‌గా రానుందా..?

తాజాగా సమాచారం ప్రకారం పూజా హెగ్డే తాను ఓ టైమ్‌లో కలిసిన మేనేజర్లు, డైరెక్టర్లు, నిర్మాతలతో మళ్లీ టచ్‌లోకి వెళ్లిందని టాక్. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, కొత్త ప్రాజెక్టులు ఏవైనా ఉన్నాయా అనే దిశగా అడిగి తెలుసుకుంటోందట. గతంలో ఆమెకు అవకాశాలు కల్పించిన వ్యక్తులతో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోందట. ఇక తెలుగులో పూజా చివరిసారిగా ‘ఆచార్య’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రాల పై ఫోకస్ పెంచింది. అదృష్టవశాత్తూ అక్కడ కొన్ని ప్రాజెక్టులు సెట్ అయ్యాయి. మరిక పాత పరిచయాలతో పూజా ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Exit mobile version