Police Complaint: 52 మందితో 45 రోజుల్లోనే ‘పోలీస్ కంప్లైంట్’

Police Complaint Movie

Police Complaint Movie

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ‘ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్’ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర ట్రైలర్ మరియు రెండు ప్రత్యేక గీతాల లాంచ్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఇదే వేడుకలో టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతిని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను గుర్తు చేస్తూ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేశారు. ఈ పాటను కృష్ణ వీరాభిమానుల చేతుల మీదుగా లాంచ్ చేయడం విశేషం. కృష్ణ వీరాభిమాని, నటుడు కృష్ణసాయి, నటి ప్రీతి సుందర్ ఈ పాటలో మెరిశారు. ఈ గీతానికి దర్శకుడు సంజీవ్ మేగోటి స్వయంగా సాహిత్యం, సంగీతం అందించారు. నువ్వుట్టా సూత్తా ఉంటే అనే మరో మాస్ గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటలో నటి కృతి వర్మ స్పెషల్ అప్పియరెన్స్‌లో అలరించింది. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ “గతంలో నాకు సూపర్ స్టార్ కృష్ణతో వర్క్ చేసే గొప్ప అవకాశం దక్కింది. నాలుగు పేజీల డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పిన మహానటుడు ఆయన. ఆయన బర్త్ డే రోజున మా ట్రైలర్ రావడం గర్వంగా ఉంది. ఈ సినిమాను 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లోనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే సరికొత్త పాయింట్ చుట్టూ తిరిగే హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన చిత్రమిది” అని వివరించారు.

×
×
Ad