Police Complaint: 52 మందితో 45 రోజుల్లోనే ‘పోలీస్ కంప్లైంట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ‘ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్’ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర ట్రైలర్ మరియు రెండు ప్రత్యేక గీతాల లాంచ్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఇదే వేడుకలో టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతిని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను గుర్తు చేస్తూ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేశారు. ఈ పాటను కృష్ణ వీరాభిమానుల చేతుల మీదుగా లాంచ్ చేయడం విశేషం. కృష్ణ వీరాభిమాని, నటుడు కృష్ణసాయి, నటి ప్రీతి సుందర్ ఈ పాటలో మెరిశారు. ఈ గీతానికి దర్శకుడు సంజీవ్ మేగోటి స్వయంగా సాహిత్యం, సంగీతం అందించారు. నువ్వుట్టా సూత్తా ఉంటే అనే మరో మాస్ గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటలో నటి కృతి వర్మ స్పెషల్ అప్పియరెన్స్‌లో అలరించింది. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ “గతంలో నాకు సూపర్ స్టార్ కృష్ణతో వర్క్ చేసే గొప్ప అవకాశం దక్కింది. నాలుగు పేజీల డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పిన మహానటుడు ఆయన. ఆయన బర్త్ డే రోజున మా ట్రైలర్ రావడం గర్వంగా ఉంది. ఈ సినిమాను 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లోనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే సరికొత్త పాయింట్ చుట్టూ తిరిగే హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన చిత్రమిది” అని వివరించారు.
Also Read
- Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక మోహన్!
- Peddi : 'పెద్ది' ఆకలి తీరుస్తుందా?
- Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
- Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
తాజావార్తలు
-
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక మోహన్!
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
-
Kapil Sibal: భారత్‌లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!