Police Complaint: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Complaint: విలక్షణ నటనతో మెప్పించే వరలక్ష్మి శరత్‌కుమార్, వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో, హారర్-యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు కృష్ణసాయి పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చింది. సూపర్ స్టార్ కృష్ణపై రూపొందించిన ఒక స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కృష్ణసాయి తన అభిమాన నటుడైన కృష్ణకు ఈ పాట ద్వారా ఘనమైన నివాళి అర్పించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ‘అఘోర’, ‘రాఘవరెడ్డి’, ‘ఆదిపర్వం’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన సంజీవ్ మేగోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్రల కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ, ఇందులో హారర్ థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించాం” అని తెలిపారు. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మే 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Kamal : సిద్ధా' డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
- Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
తాజావార్తలు
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్‌లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
-
PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!