ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్ సిరిస్ లను సెన్సార్ చేయాలని ఎప్పటినుండో డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని లీడింగ్ ప్లాట్ ఫామ్స్ లో హాలీవుడ్ కు చెందిన వెబ్ సిరీస్ లో సెక్సువల్ కంటెంట్ ను ఎటువంటి వార్నింగ్ నోట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ప్రసారం చేస్తున్నారని ఎప్పటినుండో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో సెక్సువల్ కంటెంట్ పై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
Also Read : Sharwa38 : శర్వాకు జోడిగా ప్లాప్ హీరోయిన్
ఎలాంటి చెకింగ్ లేకుండా ఓటిటిలో సెక్సువల్ కంటెంట్ ప్రసారం చేస్తున్నారని. చిన్న పిల్లలు, యువత అడల్ట్ కంటెంట్ కు అడిక్ట్ అవుతున్నారని వారు పక్కదోవ పట్టె అవకాశం ఉందని తద్వారా నేరాల రేటు పెరుగుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఓటీటీలోని అభ్యంతరకరమైన కంటెంట్ ప్రసారంపై నెటిజన్స్ లో ఆందోళన వ్యక్తం చేస్తూ సినిమాలకు ఎలాగైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తరహాలో కంటెంట్ చెకింగ్ ఉంటుందో, OTT ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేయబడే కంటెంట్ ను పర్యవేక్షించి, సిర్టిఫికేట్ అందిచేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఓటీటీ కంటెంట్ నిషేధంపై జవాబు చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం.ఓటిటి కంటెంట్ పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసిందని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ వెల్లడించింది. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని మాపై ఇప్పటికి ఆరోపణలు వస్తున్నాయన్న జస్టిస్ బీహార్ గవాయ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్ట్ తుది తీర్పు ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
