Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satish Kilaru: బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు రైతు. నేను విజయవాడలో చదువుకున్నాను. ఇంజినీరింగ్ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వెళ్లాను. నవీన్ గారు నా క్లోజ్ ఫ్రెండ్. ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. అలా మేము సినిమాల్లోకి వచ్చాం. నిర్మాతగా నా తొలి సినిమా రామ్ చరణ్ గారితో చేయడం నా అదృష్టం. ఆయన ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడింది. ఈ సినిమాను మేము అనుకున్న బడ్జెట్లో, గ్రాండ్ స్కేల్లో అద్భుతంగా తెరకెక్కించాం. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు అదే పాజిటివ్ ఎనర్జీతో పని చేశాం. షూటింగ్ చివరి రోజు హీరో గారు, డైరెక్టర్ గారు అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు’.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
‘ఈ సినిమా వరకు మా జర్నీ చాలా హ్యాపీగా సాగింది. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు షూటింగ్ చాలా కూల్‌గా జరిగింది. ఎలాంటి పెద్ద ఛాలెంజెస్ ఎదురుకాలేదు. బుచ్చిబాబు ఈ సినిమా కథ చెప్పినప్పుడు అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకులు థియేటర్లో కూర్చునే ఉంటారు. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్.. ప్రతిదీ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ప్రేక్షకులు సినిమాలో ఏం కోరుకుంటాడో, అవన్నీ ఒక పూర్తి ప్యాకేజ్‌లా బుచ్చిబాబు ఈ సినిమాలో అందించారు. నిజానికి ఇది చాలా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమా. డైరెక్టర్ ఏది చెప్పారో, చరణ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆయన శరీరం సహకరించకపోయినా, ఫిజియో చేయించుకుని వెంటనే షూట్‌కు రెడీ అయ్యేవారు. ఆయన పడిన కష్టం ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై చూడబోతున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు నేను సెట్లోనే ఉండేవాడిని’.
‘‘పెద్ది’లో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అనుకోవడం లేదు. కథ నుంచి మొత్తం బుచ్చిబాబే చూసుకున్నారు. కథ విషయంలో ముందుగా ఆయన తన గురువు సుకుమార్ గారితో షేర్ చేసుకుని ఉండొచ్చు ఏమో కానీ షూటింగ్ మొదలైన తర్వాత మొత్తం బుచ్చిబాబే చూసుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత దీనిపై అంచనాలు మరింతగా పెరుగుతాయి. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించేలా ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు వెంటనే సినిమా చూడాలని అనుకుంటారు. ‘పెద్ది’ని చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా, ఓవర్సీస్లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..