PEDDI : తమిళ్, కన్నడలో పెద్దికి పోటీ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRRతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్‌ను శంకర్ గేమ్ ఛేంజర్‌తో డ్యామేజ్ చేశాడు. మూడేళ్ల పాటు చెక్కిన ఈ కళాఖండం డిజాస్టర్‌గా మారింది. దీంతో స్టార్ డైరెక్టర్స్‌ను పక్కన పెట్టి వన్ మూవీ ఎక్స్ పీరియన్స్ ఉన్న బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చాడు. బుచ్చి ఎలా తీస్తాడో అని డౌట్స్ పడుతున్న వేళ మూవీ గ్లింప్స్, చికిరి, రైరైరారా సాంగ్స్ మూవీపై అంచనాలు డబుల్ చేశాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడు.
పెద్ది తొలుత మార్చి 27న రిలీజ్ అనుకోగా.. షూటింగ్ ఇన్ కంప్లీట్, ఏఆర్ రెహమాన్ స్కోర్ డిలే వల్ల ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో షూట్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఇందులో స్పెషల్ సాంగ్ పెండింగ్ ఉన్నట్లు టాక్. దీని కోసం బుచ్చి ముగ్గురు ట్రెండింగ్ భామలను పరిశీలిస్తున్నాడట. గురువు సుకుమార్ ఫిల్మ్ రంగస్థలంలో జిగేల్ రాణిలా మెరిసిన పూజా హెగ్డేతో పాటు మృణాల్ ఠాకూర్, ధురంధర్‌లో ఐటమ్ సాంగ్‌తో చించేసిన ఆయేషా ఖాన్ నేమ్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పెద్దిని ఏప్రిల్ 30న పాన్ ఇండియా రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. టాలీవుడ్, నార్త్ బెల్ట్‌లో మూవీకి పోటీగా పెద్దగా సినిమాలు లేవు. కానీ సౌత్ ఇండియాలో పొరుగు ఇండస్ట్రీలైన తమిళ్ అండ్ కన్నడ నుండి కాంపిటీషన్ తప్పదు. ఈ మూవీ రిలీజౌతున్న డేట్‌నే తమిళంలో కరతో వస్తున్నాడు ధనుష్. ఈ మూవీ కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇటు కన్నడలో అదే రోజు కేడీ ద డెవిల్ కూడా పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కాబోతోంది. ఇక మలయాళంలో మల్టీస్టారర్ ఫిల్మ్ పేట్రియాట్ ఏప్రిల్ 23నే రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ క్లిక్ అయితే.. పెద్ది ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. త్రిబుల్ ఆర్‌తో తమిళ్, కేరళలో భారీ ఓపెనింగ్స్ సాధించిన రామ్ చరణ్ పెద్ది రిజల్ట్ ఎలా ఉండబోతుందో.
Also Read
- Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Kalyanam Kamaneeyam : రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో రస్టీ లవ్ స్టోరీ టీజర్!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?