పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్‌ల ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో క్రిష్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమా పూర్తి చేశారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ప్రీమియర్‌లతో 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read : Hari Hara Veera Mallu: నిజంగా అంత ఖర్చు అయ్యిందంటారా?
అయితే నిజానికి ఈ సినిమాకి దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో సినిమా రిలీజ్ చేసే విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్‌తో ప్రస్తుతం ఉస్తాబ్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న నిర్మాత మైత్రి రవి ఎర్నేనితో పాటు గతంలో పవన్ కళ్యాణ్‌తో బ్రో లాంటి సినిమా చేసిన మరో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రంగంలోకి దిగి చివరి నిమిషంలో ఎదురైన ఫైనాన్స్ ఇష్యూస్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Kingdom : ఏపీలో కింగ్‌డమ్ టికెట్ రేట్లు హైక్.. ఎంతంటే?
వారిద్దరూ కొంత అమౌంట్‌కి అడ్డం ఉండి సినిమా రిలీజ్‌కి సహకరించినట్లుగా తెలుస్తోంది. నిజానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాకి సంబంధించి 35 కోట్ల రూపాయలు చెల్లించి నైజాం హక్కులు కొనుగోలు చేసింది. ఆ అమౌంట్ కాకుండా మరికొంత అమౌంట్‌కి విశ్వప్రసాద్‌తో కలిసి మైత్రి సంస్థ అడ్డం ఉన్నట్లుగా సమాచారం. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఫైనాన్స్ క్లియర్ చేయడంతో ప్రీమియర్‌లు సమయానికి పడ్డాయి. నిజానికి 9:36 నిమిషాలకు ప్రీమియర్‌ల ముహూర్తం ఫిక్స్ చేసినా, దాదాపు పావుగంట 20 నిమిషాల లేటుగా షోలు పడ్డాయి.
