టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, NDAలో కీలక నాయకుడిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఆయన తన కమిట్మెంట్స్ కారణంగా నట జీవితాన్ని పూర్తిగా వదులుకోలేక పోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీసు అధికారిగా నటిస్తున్నారు, శ్రీ లీల, రాశి ఖన్నా కథానాయికలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలకు సిద్ధమవుతుంది.
Also Read : Mahesh Babu : 50 ఏళ్ల రాజకుమారుడు
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, పవన్ ఏడాదిన్నర రోజుల పాటు విరామం (అంటే సినిమాలకు మాత్రమే) తీసుకుని, సార్వత్రిక ఎన్నికల ముందు ఒకటి లేదా రెండు సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో, ఆయన కుమారుడు అకిరా నందన్‌ను హీరోగా లాంచ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అయినప్పటికీ, రాజకీయాలే ఆయన ప్రాధాన్యతగా ఉంటాయి, కానీ సినిమాల నుండి రిటైర్ కావడం లేదు. అదే ఆయనకు ఆదాయ వనరు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ రెండు రంగాల్లో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నాడని టాక్.
